గత కొద్ది నెలలుగా మా ఎన్నికల గురించి నిత్యం సోషల్ మీడియాలో కథనాలు వెలువడుస్తున్నాయి. ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సీవిఎల్ ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రధాన ఎజెండా.. మా బిల్డింగ్.. ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఇటీవలే మా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో రిజల్ట్స్ వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడానికి సిద్ధమయ్యారు. రేపు (గురువారం) ఆయన తన మా ప్యానెల్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండునున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ధీటుగా సీనియర్ నటులను సైతం మంచు విష్ణు రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మా ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. రేపు మంచు విష్ణు ప్రకటించబోయే ప్యానల్ సభ్యులతో మా ఎన్నికలతోపాటు.. సినీ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో చూడాలి.
Also Read: SaiPallavi: ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా.. లవ్ స్టోరీ గురించి హీరోయిన్ సాయి పల్లవి ముచ్చట్లు..
GodFather: గాడ్‌ఫాదర్ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కోసం..