
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ లిరిసిస్ట్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అనంత్ శ్రీరామ్..ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ మలుపు తిప్పిన పాటలు చాలానే ఉన్నాయని గతంలో పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఓ సితార, ఆరడుగుల బుల్లెట్, సాయంకాలాన సాగర తీరాన వంటి విజయవంతమైన పాటలకు తనకు ప్రశంసలు సైతం వచ్చినట్లు తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
అనంత శ్రీరామ్ 2013లో తన కెరీర్ నెమ్మదించిందని.. పెద్ద సినిమాలు ఏవీ రాకపోయాయని వెల్లడించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఎం సందేహం లేదు పాట విడుదలై, తన కెరీర్‌ను మలుపు తిప్పిందని ఆయన పేర్కొన్నారు. ఒక పెద్ద సినిమాలో పాట విడుదలైనప్పుడు లభించేంత స్పందన ఈ పాటకు లభించిందని, ఆ తర్వాత అనేక కొత్త అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటిగా తనను వెతుక్కుంటూ వచ్చాయని ఆయన వివరించారు. ఈ పాట తన వృత్తి జీవితాన్ని మార్చేసిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎం సందేహం లేదు పాట తన కెరీర్‌కు పునరుజ్జీవం పోసిందని అనంత శ్రీరామ్ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా పాటలు రాశారు. 2005లో వచ్చిన కాదంటే అవుననిలే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అందరివాడు సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలకు పాటలు అందించినప్పటికీ ఆ స్థాయిలో సక్సెస్ రాలేదు. తర్వాత ఏం సందేహం లేదు పాటతో తిరిగి ఫాంలోకి వచ్చారు. కేవలం 20 ఏళ్లల్లోనే వెయ్యికి పైగా పాటలు రాశారు.
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..