
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళనాడులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. అభిమానులంతా ఇళయదళపతి అంటూ ముద్దుగా పిలిచుకునే ఈ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న విజయ్.. తాజాగా లియో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. తెలుగులో విజయ్ కు ఫాలోయింగ్ ఉండడంతో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేశారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా భారీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కలెక్షన్స్ విజయ్ కెరీర్ లోనే సాలిడ్ ఓపెనింగ్స్ అని తెలుస్తోంది. ఇందులో త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలకపాత్రలలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ రోల్స్ పోషించారు. అయితే లియో సినిమా కలెక్షన్స్ గురించి ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కేవలం సోషల్ మీడియా నివేదికల ఆధారంగా ఈ చిత్రం మొత్తం రూ.140 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో నిన్న ఒక్కరోజే రూ.63 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ నుంచి రూ.66 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది.
Thank you so much for the lovely wishes sir, I’m glad you loved the film 🤗 https://t.co/zAMFv0POb1
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 18, 2023
లియో బాక్సాఫీస్ కలెక్షన్స్.
తమిళనాడు – 30 కోట్లు
కేరళ – 11 కోట్లు
కర్ణాటక – 14 కోట్లు
ఏపీ-టీజీ – రూ.15 కోట్లు
రెస్ ఆఫ్ ఇండియా (ROI) – రూ. 4 కోట్లు
Thank you so much brother ❤️ https://t.co/zKHR51SGoT
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 6, 2023
దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ ఈ సినిమాతో మరోసారి జోడి కట్టాయి. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబోను వెండితెరపై చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.