Sirivennela Sitaramasastri: కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్..

|

Dec 01, 2021 | 8:30 AM

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మూడున్నర దశాబ్దాల పాటు వెల్లివిరిసిన సిరివెన్నెల మాయమైంది. తెలుగు పాటకు వన్నె తెచ్చిన సీతారామశాస్త్రిగారు ఇక లేరు.

Sirivennela Sitaramasastri: కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్..
Sirivennela Last Phone Call
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మూడున్నర దశాబ్దాల పాటు వెల్లివిరిసిన సిరివెన్నెల మాయమైంది. తెలుగు పాటకు వన్నె తెచ్చిన సీతారామశాస్త్రిగారు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన అకాల మరణం చెందారు. దీంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. ఆయన మరణాన్ని చాలామంది సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతోటి బంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

సిరివెన్నెల అక్షరాల్లో ఆవేశం ఉంటుంది. అదే కలం నుంచి ప్రేమగీతాలు జాలువారుతాయి. చీకట్లోంచి వెలుగులోకి నడిపించే బాట వేస్తాయి. పాటలే కాదు మాటలు కూడా. వ్యక్తిత్వ వికాసం నేర్పుతాయి. నాటి తరానికి-నేటి తరానికి వారధిగా నిలిచిన తెలుగు సాహితీ ముద్దుబిడ్డ సిరివెన్నెల అకాల మరణం.. తెలుగు పాటకు తీరని లోటు.

కాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు చెప్పారు. తనకు లంగ్ ఆపరేషన్ ఫిక్స్ అయినట్లు తెలియజేశారు. వాసు సనిమా రాయాల్సి ఉంది.. కానీ రెండు నెలలు రాయలేనన్నారు. డిసెంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాక పాట రాస్తానన్నారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాననే నమ్మకం కావొచ్చు.. తన ఆరోగ్య పరిస్థితిపై నవ్వుతూ సరదాగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన వెన్నెలలో కలిసిపోయారు.

Also Read: Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’