Legend Saravanan: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘ది లెజెండ్’.. అస్సలు ఇలా మారిపోయాడేంటి.!

ఆయన చేసింది ఒక్క చిత్రమే. కానీ సినిమాలంటే పిచ్చి. ఐదు పదుల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు..

Legend Saravanan: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ది లెజెండ్.. అస్సలు ఇలా మారిపోయాడేంటి.!
The Legend

Updated on: Mar 13, 2023 | 7:00 PM

ఆయన చేసింది ఒక్క చిత్రమే. కానీ సినిమాలంటే పిచ్చి. ఐదు పదుల వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈయన చేసిన సినిమాపై విమర్శలు, మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అయితేనేం అవేం పట్టించుకోకుండా.. సినిమాపై తనకున్న మమకారాన్ని చాటుతూ.. త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయబోతున్నాడు. ఇంతకీ అతడెవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్.

‘ది లెజెండ్’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. త్వరలోనే మరో కొత్త మూవీని ప్రకటించనున్నారు. ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈయన ‘ది లెజెండ్’ హీరోనేనా అని అనుమానం రాకమానదు. కొత్త చిత్రం కోసమే ఇలా లుక్ మార్చినట్లు.. త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానని లెజెండ్ శరవణన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా, శరవణన్ నటించిన ‘ది లెజెండ్’ కొద్దిరోజుల కిందట డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలోకి విడుదలైన తొలి రోజే అత్యధిక వ్యూస్ సాధించిన విషయం విదితమే.