
ఒకానొక టైంలో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు లయ. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లయ. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసారు లయ. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేశారు లయ.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ
హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన లయ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. మొన్ననే నితిన్ తో తమ్ముడు అనే సినిమా చేశారు లయ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన మొదటి సినిమా స్వయంవరం డైలాగ్ రైటర్‌గా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన అనుబంధాన్ని ఆమె ప్రస్తావించారు. జగపతి బాబు మాట్లాడుతూ ఇప్పుడు జగపతి బాబు లుక్కే నచ్చింది. నేను కూడా ఆయనతో చాలా సార్లు చెప్పా.., ఇప్పుడు లుక్ లో చాలా స్మార్ట్‌గా ఉన్నారండి అని చెప్పాను. అని లయ పేర్కొన్నారు. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చాలా బాగుందని, అది ఆయన వయస్సును తెలియనివ్వడం లేదని అన్నారు లయ.
అరవింద సమేత చిత్రంలో జగపతి బాబు భార్య పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్రను తాను తిరస్కరించినట్లు తెలిపారు లయ. అది మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది. నాకు నిజంగా తెలియదు. అది నేను కరెక్ట్‌గా చేశానా, తప్పు చేశానా అని అంటే నాకు తెలియదు కానీ చాలా పవర్‌ఫుల్ రోల్ మిస్ అయ్యాను.” అని లయ అన్నారు. ఆ సమయంలో పూర్తి కథ వినకుండానే ఆ పాత్రను వదులుకున్నానని, అది ఒక తప్పుడు నిర్ణయం అని ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. ఈశ్వరీ రావు ఆ పాత్రను అద్భుతంగా పోషించిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఇవే కాదు, ఇలాంటి తప్పు డెసిషన్స్ వల్ల తాను గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలను కోల్పోయానని లయ తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.