Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. అభిమానులను అలరించడానికి రెడీ అయిన లావణ్య

|

Jan 03, 2024 | 4:15 PM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే మెగా కోడలిగా ప్రమోషన్ అందుకుంది ఈ బ్యూటీ. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ యూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాల కాలంగా ఈ ఇద్దరు తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎట్టకేలకు గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.

Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి ఇలా.. అభిమానులను అలరించడానికి రెడీ అయిన లావణ్య
Lavanya
Follow us on

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే మెగా కోడలిగా ప్రమోషన్ అందుకుంది ఈ బ్యూటీ. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ యూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చాల కాలంగా ఈ ఇద్దరు తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎట్టకేలకు గత ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గుడ్ బై చెపుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

లావణ్య త్రిపాఠి తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది లావణ్య. భర్తతో కలిసి వెకేషన్స్ కు వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా ఆ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

2022లో హ్యాపీ బర్త్ డే అనే సినిమా చేసింది లావణ్య ఆతర్వాత ఇంతవరకు ఆమె మరో సినిమాలో నటించలేదు. ఇక ఇప్పుడు మిస్ ఫెర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య మెయిన్ లీడ్ గా నటిస్తుంది. బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించనున్నాడు. అలాగే  ఈ వెబ్ సిరీస్ తో పాటు ఓ తమిళ్ సినిమాలోనూ నటించనుంది.

లావణ్య త్రిపాఠి ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..