Lavanya Tripathi: నా ముద్దుల ముద్దుబిడ్డ రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెగా కోడలు లావణ్య ఎమోషనల్ పోస్ట్..

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. పెద్దలను ఒప్పించి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. 2023 నవంబర్ లో ఇటలీ వేదికగా వరుణ్ తేజ్, లావణ్యల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది

Lavanya Tripathi: నా ముద్దుల ముద్దుబిడ్డ  రెస్ట్ ఇన్ పీస్ అంటూ మెగా కోడలు లావణ్య ఎమోషనల్ పోస్ట్..
Lavanya Tripathi

Updated on: Jun 05, 2025 | 8:08 PM

మెగా మేనకోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగాను ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు. కొన్నాళ్లుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు. 2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది లావణ్య. త్వరలోనే లావణ్య తల్లి కాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. లావణ్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెట్ డాగ్ మృతి చెందింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో తెలుపుతూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. “నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. వీలైతే నాకు టీ తయారు చేసి ఇస్తానని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. ఎంత అందమైన హృదయం, ఎంత తెలివైనది..నువ్వు నిజంగా ప్రత్యేకమైనవాడివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, నా ముద్దుల ముద్దుబిడ్డ” అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అలాగే తన పెట్ డాగ్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఓం శాంతి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్ , అంతరిక్షం సినిమాల్లో వరుణ్, లావణ్య కలిసి నటించారు. కాగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య మధ్య పరిచయం ఏర్పడి ఆతర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎట్టకేలకు 2023లో పెళ్లిపీటలెక్కారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.