Lavanya Tripathi: పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా ఏమీ మారలేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్..

|

Feb 03, 2024 | 12:25 PM

ఇప్పుడామె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో అడియన్స్ ముందుకు వచ్చారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను సుప్రియ నిర్మించగా.. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా విలేకరులతో మాట్లాడిన లావణ్య.. తన సినిమాల ఎంపిక విషయంలో తానేప్పుడు అచితూచి వ్యవహరిస్తూనే ఉంటానని తెలిపింది. ఎక్కువ సినిమాలు చేయాలనే ఆరాటం తనకు లేదని..

Lavanya Tripathi: పెళ్లి తర్వాత కెరీర్‌ పరంగా ఏమీ మారలేదు.. లావణ్య త్రిపాఠి కామెంట్స్..
Lavanya Tripathi
Follow us on

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఆమె.. ఇటీవలే మెగా ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత తిరిగి తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఇప్పుడామె మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో అడియన్స్ ముందుకు వచ్చారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను సుప్రియ నిర్మించగా.. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా కనిపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా విలేకరులతో మాట్లాడిన లావణ్య.. తన సినిమాల ఎంపిక విషయంలో తానేప్పుడు అచితూచి వ్యవహరిస్తూనే ఉంటానని తెలిపింది. ఎక్కువ సినిమాలు చేయాలనే ఆరాటం తనకు లేదని.. చేసిన కొన్ని సినిమాలైన మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్ని తనకంటూ ఓ గుర్తింపు తీసుకువచ్చాయని అన్నారు.

అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత కెరీర్ పరంగా లైఫ్ ఏమి మారలేదని.. మెగా కుటుంబంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలని నాకెవరూ పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందన్నారు. వరుణ్ తేజ్ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారని.. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా వచ్చారని.. ఇంతకంటే ఏం కావాలని.. గతంలో ఎలా ఉండేవాళ్లమో అలాగే ఉన్నామని అన్నారు. తన ప్రాజెక్ట్స్ వి,యంలో వరుణ్ పెద్ద కలుగజేసుకోడని.. ఎప్పుడైనా తను సెలక్ట్ చేసిన స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడని.. మిస్ పర్ఫెక్ట్ సిరీస్ చూసి బాగుందని ప్రశంసించాడని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తున్నాని..ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారని అన్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అన్నారు. అందులో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానని అన్నారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నాని తెలిపారు లావణ్య. ప్రస్తుతం ఆమె నటించిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.