Vishwak Sen Laila: లైలాగా అదరగొట్టిన విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న టీజర్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్. మెకానిక్ రాకీ తర్వాత అతను నటిస్తోన్న చిత్రం లైలా. ఇందులో విశ్వక్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు. రామ్ నారాయాణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌లో విశ్వక్‌సేన్‌ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు.

Vishwak Sen Laila: లైలాగా అదరగొట్టిన విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న టీజర్
Laila Movie Twitter Review

Updated on: Jan 17, 2025 | 7:16 PM

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.  హీరోలు అమ్మాయిలుగా చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. లేడీ గెటప్స్ లో అద్భుతంగా కనిపించి ఆకట్టుకున్నారు హీరోలు. ఇప్పుడు ఇదే నేపథ్యంతో విశ్వక్ సేన్ రానున్నాడు. ఈ కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పేరు లైలా. చివరిగా మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో విభిన్న కథతో లైలా గా రానున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సోనూ మోడల్ గా కనిపించనున్నాడు.

హైరాబాద్ లోని పాతబస్తీలో హీరో మేకప్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. ఆడవాళ్లకు మేకప్ వేస్తూ వాళ్ళను బుట్టలో వేసుకునే లవర్ బాయ్ గా కనిపించనున్నాడు విశ్వక్ సేన్. అమ్మాయిలకు మేకప్ వేయడమే కాదు అవసరమైతే యాక్షన్ లోకి కూడా దిగుతాడు హీరో. ఇక ఈ టీజర్ లో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోసారి విశ్వక్ తన మేనరిజంతో మెస్మరైజ్ చేయనున్నాడు. అయితే సడన్ గా హీరో అమ్మాయిలా ఎందుకు మారాడు.? అమ్మాయిగా ఎందుకు విశ్వక్ మారాడు అనేది సినిమాలో చూడాల్సిందే.

ఇక విశ్వక్ అమ్మాయి గెటప్ లో చాలా అందంగా కనిపించాడు. లైలా పాత్ర చుట్టూనే సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. లైలా సినిమాను ప్రేమికుల రోజున కానుకగా ఫెబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి