Khushboo: అందుకే వెంకటేశ్‏తో నటించలేదు.. అసలు కారణం చెప్పిన ఖుష్బూ..

ఒకప్పుడు కుర్రవాళ్ల కలల రాకూమారి. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఖుష్బూ.. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్స్ అందుకుంది. ఇప్పుడు సహాయ నటిగా వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. అయితే వెంకటేశ్ తో ఓ సినిమా చేయలేకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.

Khushboo: అందుకే వెంకటేశ్‏తో నటించలేదు.. అసలు కారణం చెప్పిన ఖుష్బూ..
Kushboo, Venkatesh

Updated on: Jan 15, 2026 | 7:38 PM

ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలో వరుస హిట్స్ అందుకుంది. అప్పట్లో ఆమెకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆమె అందానికి, నటనకు యూత్ ఫిదా అయ్యారు. ఏకంగా ఆమెకు గుడి కట్టారు. అప్పట్లో హీరోయిన్ గా అలరించిన ఖుష్బూ.. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తున్నారు. ఇదెలా ఉంటే.. గతంలో వెంకటేశ్ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాలో ముందుగా తనకే ఛాన్స్ వచ్చిందని… కానీ తాను కొన్ని కారణాలతో ఆ సినిమాను వదులుకున్నట్లు తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, పర్సనల్ విషయాలతోపాటు కెరీర్ గురించి ఆసక్తకిర విషయాలు వెల్లడించింది.

ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..

వెంకటేశ్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఖుష్బూ. ఈ సినిమాకు తనను వెంకీ సిఫార్స్ చేశారని అన్నారు. హిందీలో ఓ సినిమాలో తనను చూసి ఎంపిక చేశారని.. ఆ తర్వాత నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవితో నటించే అవకాశాలు వచ్చాయని.. అప్పటికే తను తమిళంలో బిజీ అయినట్లు తెలిపారు. అదే సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యిందని తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

అలాగే వెంకటేశ్ నటించిన చంటి సినిమా కూడా తానే చేయాలని.. కానీ డేట్స్ కుదరలేదని తెలిపింది. చంటి సినిమా చేయాలంటే తమిళంలో రెండు సినిమాలు వదులుకోవాలని.. ఒక సినిమా రజినీకాంత్, మరో సినిమా కమల్ హాసన్ అని.. అందుకే ఆ సినిమా వదులుకోలేకపోయినట్లు తెలిపింది. అందుకే తాను చంటి సినిమా చేయలేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..

 

ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?