Kingdom: కింగ్‏డమ్ సినిమాపై కేటీఆర్ కొడుకు రివ్యూ.. విజయ్ రియాక్షన్ ఇదే..

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 31న అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీపై కేటీఆర్ కొడుకు హిమాన్షు రివ్యూ ఇచ్చారు.

Kingdom: కింగ్‏డమ్ సినిమాపై కేటీఆర్ కొడుకు రివ్యూ.. విజయ్ రియాక్షన్ ఇదే..
Himanshu, Vijay

Updated on: Jul 31, 2025 | 2:29 PM

విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. ఇందులో భాగ్యశ్రీ బోర్సె, సత్యదేవ్ కీలకపాత్రలు పోషించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య జూలై 31న అడియన్స్ ముందుకు వచ్చింది. ఉదయం నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బీజీఎం అదిరిపోయిందని.. అంటున్నారు. చాలా కాలం తర్వాత కింగ్డమ్ మూవీతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని అంటున్నారు.

తాజాగా కింగ్ డమ్ సినిమాపై మాజీ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు రివ్యూ ఇచ్చారు. కింగ్ డమ్ సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేశారు హిమాన్షు. “RTC X రోడ్స్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి కింగ్‌డమ్ చూశాను. మొదటిసారిగా థియేటర్‌లో ఉత్సాహభరితంగా అనిపించింది. థియేటర్ లోని బిగ్ స్కీన్, హైప్ అప్ అడియన్స్ మధ్య కింగ్ డమ్ వైబ్ గూస్ బంప్స్ కలిగించింది. విజయ్ దేవరకొండ అద్భుతమైన యాక్టింగ్. ఈ సినిమా చాలా నచ్చింది ” అంటూ ట్వీట్ చేశారు. ఇక హిమాన్షు ట్వీట్ కు విజయ్ దేవరకొండ హార్ట్ సింబల్స్ రిప్లై ఇచ్చారు.

హిమాన్షు ట్వీట్.. 

అలాగే కాసేపటి క్రితం విజయ్ దేవరకొండ సైతం ట్విట్టర్ వేదికగా కింగ్ డమ్ మూవీ రెస్పాన్స్ పై రియాక్ట్ అయ్యారు. “ప్రస్తుతం నాకు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.. మీరందరూ నాతో ఇలా అనుభూతి చెందాలని కోరుకున్నాను.. ఆ వెంకన్న స్వామి దయ.. మీ అందరి ప్రేమ.. ఇంకా ఏం కావాలి నాలాంటి ఒక్కడికి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం విజయ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

విజయ్ దేవరకొండ ట్వీట్.. 

ఇవి కూడా చదవండి.. 

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..