
కొన్నాళ్లుగా టాలీవుడ్ హీరోయిన్స్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే తన ప్రియుడితో ఆ బ్యూటీ నిశ్చాతార్థం జరిగింది. తాజాగా ఈ ఆమె పెళ్లి వేడుకలకు సంబంధించిన విషయాలు ఫిల్మ్ సర్కిల్లో మారుమోగుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా ?.. తనే టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి కర్బంద. బోణీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. రామ్ పోతినేని నటించిన ఒంగోలు గిత్త సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తీన్మార్, మిస్టర్ నూకయ్య సినిమాల్లోనూ మెరిసింది. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
ఇటీవలే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. 2019 నుంచి ప్రేమలో ఉన్న కృతి కర్బంద, పుల్కిత్ ఇప్పుడు మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెలలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 13 నుంచి మార్చి 16 వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మార్చి 15న వీరిద్దరి వివాహ వేడుక ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల మాత్రమే పెళ్లి వేడుకలలో పాల్గొననున్నారు.
కృతి కర్బంద, పుల్కిత్ ఇద్దరు కలిసి పగల్పంటి, వీరే కి వెడ్డింగ్ చిత్రాల్లో కలిసి నటించారు. చివరగా తైష్ సినిమాలో కలిసి నటించారు. చాలాకాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ జంట తమ పెళ్లి గురించి స్పందించలేదు.
పుల్కిత్ కు ఇది రెండో వివాహం. గతంలో అతడు శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె సల్మాన్ ఖాన్ కు సోదరి వరుస. 2014లో వివాహం చేసుకున్న వీరు.. 2015లో మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత యామీ గౌతమ్ తో ప్రేమలో పడ్డారు పుల్కిత్. కానీ వీరి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. 2019 నుంచి పుల్కిత్ కృతి కర్బంద ప్రేమలో ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.