Krithi Shetty: “అలాంటి అబ్బాయిలే నచ్చుతారు”.. కృతిశెట్టి మనసు గెలవాలంటే ఇలా ఉండాలంట..

|

May 23, 2021 | 11:50 PM

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Krithi Shetty: అలాంటి అబ్బాయిలే నచ్చుతారు.. కృతిశెట్టి మనసు గెలవాలంటే ఇలా ఉండాలంట..
Follow us on

Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాఫ్యామిలీనుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమాతో కృతిశెట్టి కు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమానే అయినా చక్కటి నటనతో మంచి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి శెట్టి. ఎలాంటి గ్లామర్ షోకు వెళ్లకుండా తనకు సూటబుల్ అనిపించే బబ్లీ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తోంది.  ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో  ఫుల్ బిజీగా ఉంది. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్  సినిమాలో నటిస్తుంది కృతి. అలాగే సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కృతి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాలపై క్లారిటీ ఇచ్చింది. ఈ మూడు సినిమాలు తప్ప తాను తమిళ్ లో ఎలాంటి సినిమాను ఒప్పుకోలేదని చెప్పింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ ఉంటుంది కృతిశెట్టి. తాజాగా కృతి ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగానే కృతి .. ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు? అనే ప్రశ్నకు స్పందించి.. తనకు అబద్దాలు చెప్పే అబ్బాయిలంటే ఇష్టం ఉండదని.. చిరాకు అని చెప్పింది. నిజాయితీగా నిర్భయంగా మాట్లాడే అబ్బాయిలను ఇష్టపడతాను అంటూ కుర్రకారుకు అభిప్రాయం వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుష్ అయ్యే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ టీజర్ వచ్చేస్తుందట…

Chiranjeevi, Ali : పేదలకు అండగా నిలుస్తున్న చిరంజీవి, అలీ.. కరోనా కష్టకాలంలో నిత్యావసరాల పంపిణీ..

jagame thandhiram: “నీతో.. ప్రేమలోన పడిపోయా…” అంటున్న ధనుష్.. ‘జగమేతంత్రం’ మూవీ నుంచి అందమైన పాట…