Prabhas: కాలంలో వెనక్కి వెళ్దామంటోన్న కృష్ణం రాజు.. వైరల్‌గా మారిన రెబల్ స్టార్స్ ఫొటో..

|

Feb 17, 2021 | 12:02 PM

Krishnam Raj Shares Radhe Shyam Sets Photo: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తినెలకొంది. బాహుబలి, సాహో వంటి చిత్రాల...

Prabhas: కాలంలో వెనక్కి వెళ్దామంటోన్న కృష్ణం రాజు.. వైరల్‌గా మారిన రెబల్ స్టార్స్ ఫొటో..
Follow us on

Krishnam Raj Shares Radhe Shyam Sets Photo: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తినెలకొంది. బాహుబలి, సాహో వంటి చిత్రాల తర్వాత వస్తోన్న సినిమా కావడం, అందులోనూ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కిస్తున్నాడు. 1970లో జరిగే ఓ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్ట్ చేశారు. ‘రాధే శ్యామ్’ చిత్రంలో కృష్ణంరాజు కూడా ఓ పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల తేదీని నెటిజెన్లతో పంచుకున్న ఈ సీనియర్ హీరో.. ప్రభాస్‌తో సినిమా సెట్‌లో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోతో పాటు.. ‘ప్రభాస్‌తో కలిసి 70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం. జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్న ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తోన్న మరో చిత్రం ‘ఆదిపురుష్‌’ను ఆగస్టు 11న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో కేవలం 11 రోజుల వ్వవధిలోనే తమ అభిమాన హీరో రెండు చిత్రాలు విడుదల అవుతుండడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 10.30 గంటలకు 40.29 శాతం పోలింగ్.
Anasuya: మరో ప్రయోగానికి సిద్ధమైన అందాల యాంకర్‌.. వేశ్య పాత్రలో నటించనున్న అనసూయ..