Krishna Gadu Ante Oka Range: ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. దిల్ రాజు చేతుల మీదుగా ట్రైలర్

కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు ఓ అందమైన ప్రేమ కథ రాబోతుంది. ఆ ఊరే కృష్ణ ప్ర‌పంచం. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయిని వ‌స్తుంది.

Krishna Gadu Ante Oka Range: ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. దిల్ రాజు చేతుల మీదుగా ట్రైలర్
Krishna Gadu Ante Oka Range

Updated on: Jul 26, 2023 | 4:37 PM

మంచి కంటెంట్ ఉంటే చాలు సినిమాలు ఘనవిజయాలు సొంతం చేసుకుంటున్నాయి. చిన్న హీరో, పెద్ద హీరో.. స్మాల్ బడ్జెట్, భారీ బడ్జెట్ అని తేడా లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా చాలా సినిమాలు ఉన్నాయి.  ఇదే క్రమంలో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు ఓ అందమైన ప్రేమ కథ రాబోతుంది. ఆ ఊరే కృష్ణ ప్ర‌పంచం. అలాంటి కుర్రాడి జీవితంలో ఓ అమ్మాయిని వ‌స్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న అత‌ని జీవితంలో కొన్ని ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తాయి. తండ్రి కోరిక‌ను కృష్ణ ఎలా నేర్చ‌వేర్చాడు.? కృష్ణ అనుకున్న ప‌ని సాధించాడా.? త‌న ప్రేమ‌ను గెలుచుకున్నాడా? కృష్ణ జీవితంలో త‌న ఊరితో ఉండే అనుబంధం ఎలాంటిది.?  అనేది ఈ సినిమాలో చూడాల్సిన కథ.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసి చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు దిల్ రాజు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. యువతకు నచ్చే కథాంశంతో కృష్ణగాడు అంటే ఒక రేంజ్ సినిమా ఉంటుందని అర్ధమవుతుంది. అలాగే ట్రైలర్ లో ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి

ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆగస్టు 4న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.