Kota Srinivas rao: కోటా శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం, తమ బంధం గురించి గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్..

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడిని పోగొట్టుకుంది. ఆదివారం తెల్లవారు జామున తెలుగు సినీ కళామతల్లి మరో ముద్దుబిడ్డని కోల్పోయింది. విలక్షణ నటులు శ్రీ కోట శ్రీనివాస రావు తీవ్ర అస్వస్థతతో తన సొంత ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కోటా మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కోటా మృతిపై స్పందించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Kota Srinivas rao: కోటా శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం, తమ బంధం గురించి గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్..
Kota Srinivas Rao

Updated on: Jul 13, 2025 | 9:36 AM

ప్రముఖ సీనియర్ నటుడు , మాజీ రాజకీయనాయకుడు కోటా శ్రీనివాస్ రావు తన 83 ఏట అస్వస్థతతో మరణించారు. కోటా మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారన్న వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. కోటా శ్రీనివాస్ తెలుగు చలన చిత్రపరిశ్రమలో తనదైన శైలిలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు.

కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట కూడా చిత్ర సీమకు పరిచయం అయ్యారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తనతో కలిసి వెండి తెరపై కోటా పంచుకున్న సినిమాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన నటనా శైలిని ప్రస్తావించారు. అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించగా.. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో తాము ఇద్దరం కలిసి నటించినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. 1999-2004 మధ్య ఎమ్మెల్యేగా కూడా ప్రజలకు తన సేవలందించారని చెప్పారు పవన్ కళ్యాణ్.

కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆయనకు తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందని చెప్పారు. కోటా ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించారు. ఆ పాత్రలో కోటా కనిపించరు.. వెండి తెరపై ఆయన పాత్రే కనిపిస్తుందని చెప్పారు. కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..