Vaishnav Tej: సూపర్ హిట్ నవల ‘కొండపొలం’ స్టోరీతో వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్

Vaishnav Tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉప్పెనలా దూసుకొచ్చాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి..

Vaishnav Tej: సూపర్ హిట్ నవల కొండపొలం స్టోరీతో వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్
Vaishnav Tej

Updated on: Aug 20, 2021 | 12:27 PM

Vaishnav Tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో.. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉప్పెనలా దూసుకొచ్చాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.. తాజాగా వైష్ణవ్ తేజ్ రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది.

వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీతి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిల్ ను పెట్టారు. ఉప్పెన సినిమాలో ఆసిగా నటించి తనదమైన ముద్ర వేసిన వైష్ణవ్ .. కొండపొలం లో రవీంద్ర యాదవ్ గా కనిపించనున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే క్రిష్ మార్క్ కనిపిస్తుందని… వరుణ్ తేజ్ కు కంచె సినిమా ఎలాంటి మధురానిభూతిని ఇచ్చిందో అలాగే..వైష్ణవ్ కు ఈ సినిమా అలాగే మైల్ స్టోన్ గా నిలుస్తుందని అభిమాలును హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ లో అడవి, పచ్చని కొండలు, కొండల మీద గొర్రెలు .. దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి నవల కొండపొలం ఆధారంగా తెరకెక్కించారు. తానా నవలల పోటీలో ఉత్తమ రచనగా ఆ నవల అవార్డుని సొంతం చేసుకుంది. దీంతో సినిమాగా కూడా అలరిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొండపొలం అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో వైష్ణవ సెకండ్ హిట్ అందుకుంటాడా లేదో చూడాలి మరి

Also Read: Ajwain Leaves: మీ ఇంట్లో పిల్లలున్నారా.. అయితే ఈ మొక్క తప్పనిసరిగా ఉండాల్సిందే..ఎన్నో వ్యాధులకు చక్కని దివ్య ఔషధం