RRR Movie: ఎన్టీఆర్ నటన అద్భుతం.. వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా

RRR Movie: ఎన్టీఆర్ నటన అద్భుతం.. వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..
Komuram Bheemudo Song

Updated on: May 06, 2022 | 6:16 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ముగ్దులయ్యారు. ఇక మరోవైపు ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూ్బ్‏ను షేక్ చేస్తున్నాయి. నాటు నాటు, ఎత్తర జెండా, కొమ్మా ఊయ్యాల సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటల వీడియోలను యూట్యూబ్‏లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాటు నాటు సాంగ్, ఎత్తర జెండా సాంగ్ వీడియోస్ రిలీజ్ చేసిన మేకర్స్..తాజాగా కొమురం భీముడో వీడియో సాంగ్ విడుదల చేశారు.

అల్లురి సీతారామరాజు (చరణ్) చేతిలో కొమురం భీమ్ (తారక్) దెబ్బలు తినే సమయంలో ఎన్టీఆర్ పాడే ఈ పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. కొమురం భీముడో.. కొమురం భీముడో.. అంటూ సాగే ఈ పాట శ్రోతల మనసులను మెలిపెట్టకమానదు.. ముఖ్యంగా ఈ పాటలోని సుద్దాల అశోక్ తేజ రాసిన లీరిక్స్.. కాలబైరవ తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశాయి.. అలాగే.. ఎన్టీఆర్ అద్భుతమైన నటన ఈ పాటను మరో లెవల్‏ను తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సాంగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..

Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..