Kasthuri Shankar: బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్ కస్తూరి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి కస్తూరి బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె ప్రచారానికే పరిమితమవుతారా? లేదా? ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

Kasthuri Shankar: బీజేపీలో చేరిన ఫైర్ బ్రాండ్ కస్తూరి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!
Kasthuri Shankar

Updated on: Aug 15, 2025 | 7:14 PM

ప్రముఖ తమిళ నటి కస్తూరి బీజేపీలో చేరారు. శుక్రవారం (ఆగస్టు 15) తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్‌జెండర్ కార్యకర్త, నామిస్‌ సౌత్‌ క్వీన్‌ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కస్తూరి గత కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఆ పార్టీకి మద్దతుగా పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీలోకి చేరవచ్చునన్న ఊహాగానాలు తలెత్తాయి. ఇప్పుడవి నిజమయ్యాయి. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేశారు కస్తూరి. భారతీయుడు, అన్నమయ్య, మా ఆయన బంగారం, చిలక్కొట్టుడు, రథయాత్ర, డాన్ శీను, శమంతకమణి, గాడ్ ఫాదర్ తదితర సినిమాలు కస్తూరికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సినిమాలతో పాటు   పలు సూపర్ హిట్ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. అదే సమయంలో వివాదాస్పద కామెంట్లు, చర్యలతోనూ పలు సార్లు వార్తల్లో నిలిచారు.

గత ఏడాది నవంబర్ 3న చెన్నైలో హిందూ మక్కల్ కచ్చి నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడులో నివసించే తెలుగు మాట్లాడే ప్రజలు తమను తాము తమిళులుగా చెప్పుకుంటున్నారని, తెలుగు వారు పూర్వకాలంలో రాజుల అంతఃపురాల్లో పరిచారకులుగా పనిచేసిన వారి వారసులంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీనికి సంబంధించి నటిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

 

బీజేపీ కండువాతో నటి కస్తూరి శంకర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.