Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

|

Mar 29, 2023 | 12:32 PM

మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది.

Vikramarkudu: విక్రమార్కుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Vikramarkudu
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ గా.. అత్తిలి సత్తిబాబు అనే దొంగ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా సెకండ్ హీరోయిన్ గా చేసిన ముద్దుగుమ్మ గుర్తుందా..? విక్రమార్కుడులో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అలరించింది ఈ బ్యూటీ. ఈ అమ్మడి పేరు రుతిక.

విక్రమార్కుడు సినిమా తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా వరకు సహాయక పాత్రల్లోనే నటించింది. బోల్డ్ పాత్రల్లోనూ మెప్పించింది రుతిక. విక్రమార్కుడు తర్వాత బ్లెడ్ బాబ్జి సినిమాలో నటించింది ఈ చిన్నది.

ఇక ఈ భామ బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా..?రుతిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ruthika