
బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసిన నటి సుజిత. తెలుగు, తమిళం భాషలలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. వదినమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇందులో తన సహజ నటనతో కట్టిపడేసింది. నిజానికి సుజిత.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. చిరంజీవి నటించిన జై చిరంజీవా మూవీలో చిరు చెల్లిగా కనిపించింది. ప్రస్తుతం తమిళంలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు సుజిత బ్యాగ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఆమె అన్న ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్ అని మీకు తెలుసా.. ?.. అవును.. సుజిత అన్న పేరు సూర్య కిరణ్. ఇటీవలే సూర్య కిరణ్ అనారోగ్య సమస్యలతో మరణించారు.
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..
దర్శకుడు సూర్య కిరణ్ భార్య ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యలో సుజిత మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన అన్నా, వదిన విడిపోయారని తెలిపింది సుజిత. విడాకుల తర్వాత కళ్యాణి సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు తెలుగులో ఆమె ఫేమస్ హీరోయిన్. 2000వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. రాజశేఖర్ నటించిన శేషు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఆ తర్వాత రవితేజ సరసన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, వసంతం, దొంగోడు, లేత మనసులు వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. హోమ్లీ లుక్ లో, తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది కళ్యాణి. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కళ్యాణి దర్శకురాలిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
Sujitha, Kalyani
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..