Trisha – Nayanthara : త్రిష, నయనతార ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా.. ? ఎవరు రిచ్ అంటే..

దక్షిణాది సినీపరిశ్రమలో దాదాపు 20 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు త్రిష, నయనతార. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ వీరిద్దరి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు. ఇటీవలే నయన్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Trisha - Nayanthara : త్రిష, నయనతార ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా.. ? ఎవరు రిచ్ అంటే..
Nayanthara, Trisha

Updated on: Feb 06, 2026 | 8:22 AM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో త్రిష, నయనతార ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. దాదాపు 20 సంవత్సరాలుగా ఎన్నో హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ నాలుగు పదుల వయసులోనూ సినీరంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే చాలా కాలంగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇటీవల వీరిద్దరు కలిసి వేకేషన్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా.. ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని అర్థమవుతుంది. వారి శత్రుత్వం ముగిసిందని అభిప్రాయాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరి గురించి నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. వారిద్దరి సినీప్రయాణం, జననం, పర్సనల్ లైఫ్ గురించి సెర్చ్ చేస్తున్నారు.

త్రిష కృష్ణన్ మే 4, 1983న చెన్నైలో జన్మించారు. ఆమె తమిళ కుటుంబానికి చెందినవారు. ఆమె తల్లి ఉమా కృష్ణన్ గృహిణి కాగా, తండ్రి కృష్ణన్ హోటల్ మేనేజర్. త్రిష సేక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో చదివి, ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాలేజీ సమయంలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. త్రిష కృష్ణన్ అనేక ప్రింట్, టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆమె 1999లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకుంది. 1999లో జోడి చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. తర్వాత 2002లో “మౌనం పేసియాదే”తో కథానాయికగా మారింది. తెలుగులో వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తెలుగు, కన్నడ, తమిళం భాషలలో వరుసగా హిట్స్ అందుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు జోరు తగ్గించిన త్రిష.. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత మరోసారి వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. 20 సంవత్సరాల్లో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్స్ నుంచి ఏడాదికి రూ.9 కోట్లు సంపాదిస్తుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.85 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అలాగే మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, BMW 5 సిరీస్ వంటి కార్లు ఉన్నాయి.

ఇక నయనతార విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె నవంబర్ 18, 1984న బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి కురియన్ కొడియట్టు భారత వైమానిక దళంలో ఉన్నారు. నయనతార తిరువల్లలోని మార్ థోమా కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో బి.ఎ. పట్టా పొందారు. ఆమె కళాశాలలో చదువుతున్నప్పుడే మోడలింగ్ ప్రారంభించింది, 2003లో మలయాళ చిత్రం “మనస్సినక్కరే”తో అరంగేట్రం చేసింది ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇటీవలే మన శంకరవరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె 75 కి పైగా చిత్రాలలో నటించింది. ఆమె 2023 లో “జవాన్” తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నయనతార ఒక్కో చిత్రానికి రూ.10 కోట్లు తీసుకుంటుంది. 2021 లో, నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి “రౌడీ పిక్చర్స్” అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. దీని విలువ రూ.50 కోట్లు. ఆమె స్కిన్, కాస్మోటిక్స్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆమె ఆస్తులు రూ.200 కోట్లు వరకు ఉన్నట్లు సమాచారం. ఆమె వద్ద 1.76 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు,1 కోటి రూపాయల విలువైన SUV ఉన్నాయి. ఆమె వద్ద50 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..