
సాధారణంగా అన్నీ చిత్రాలు మంచి హైప్ మీద థియేటర్లలో విడుదలవుతుంటాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. సూపర్ హిట్ అవుతాయనుకున్న చిత్రాలు ఊహించని విధంగా పరాజయం పాలవుతాయి. కానీ ఓటీటీలో అదే చిత్రాలు సూపర్ హిట్ కావడం మనం చూసి ఉంటాం. ప్రస్తుతం థియేటర్లలో ఆశించినంత విజయం సాధించని అలాంటి ఒక సినిమా ఓటీటీలో బాగా రాణిస్తోంది. ఇప్పుడు ఆ సినిమాను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా. మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు బేబీ డూ డై డో. బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి థియేటర్లలో పెద్దగా స్పందన రాలేదు. కానీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన వెంటనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..
హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ‘బేబీ డూ డై డూ’ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు సరైన రెస్పాన్స్ రాలేదు. అటు కలెక్షన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ విమర్శకుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, కేవలం నాలుగు రోజుల్లోనే టాప్ 10లోకి చేరుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్-10 జాబితాలో నాల్గవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..
‘బేబీ డూ డై డూ’ కథ సస్పెన్స్, థ్రిల్లర్‌తో నిండి ఉంటుంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి ఒక మహిళా సీరియల్ కిల్లర్ పాత్రను పోషించింది. ఆమె ప్రత్యేకంగా పురుషులను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే, ఆమె కేవలం పురుషులను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుందనే కారణమే ఈ సినిమా అసలు కథ. అంతేకాదు ఇందులో హుమా ఖురేషి పాత్రకు మాట్లాడటం, వినడం రాదు. ఈ చిత్రానికి నాచికేత్ సమంత్ దర్శకత్వం వహించారు. సలీం సిబ్లింగ్స్, పూణే 04 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హుమా ఖురేషీతో పాటు, సికందర్ ఖేర్ , చంకీ పాండే కూడా ముఖ్య పాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..