Tollywood : తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై 22 కేసులు.. చివరకు సుప్రీంకోర్టుకు..

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె అందమైన హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సహయ నటిగా అలరిస్తుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటుంది. కానీ ఇటీవల ఆమె చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో ఆమె పై దాదాపు 22 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై 22 కేసులు.. చివరకు సుప్రీంకోర్టుకు..
Khusbhoo

Updated on: Jul 16, 2026 | 11:55 AM

భారతీయ సినిమా రంగంలో కీర్తి ప్రతిష్టలు సాధించిన ఒక టాప్ హీరోయిన్ జీవితం ఒక సినిమా కథలా ఉంటుంది. వెండితెరపై ఆమె కెరీర్ ఎంత విజయవంతమైతే, నిజ జీవితంలో ఆమె అంత ఎక్కువ పోరాటం, బాధను అనుభవించారు. బాలనటిగా హిందీ చిత్రాల్లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. 80-90వ దశకాల్లో దక్షిణాది సినిమా ప్రపంచాన్ని ఏలారు. కానీ ఈ గ్లామర్ ప్రపంచం వెనుక, ఆమె దుఃఖం చాలా లోతైనది, అది ఆమె బాల్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఖుష్బూ సుందర్. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. తనకు కేవలం 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. ‘ఇది చాలా కష్టమైన విషయం, ఇది నన్ను చాలా కాలంగా వేధిస్తోంది. నేను కోరుకున్నా కూడా దానిని మర్చిపోలేను’అని అన్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

అయితే 2005వ సంవత్సరంలో, భద్రత , బాధ్యతను దృష్టిలో ఉంచుకుంటే పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో తప్పులేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె ప్రకటన తమిళనాడు రాజకీయ, సామాజిక వర్గాలలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అనేక చోట్ల ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అంతేకాకుండా, ఆమెపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ న్యాయ పోరాటం దేశ సుప్రీంకోర్టుకు చేరగా, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ ఆ అత్యున్నత న్యాయస్థానం, ఖుష్బూ సుందర్‌పై దాఖలైన మొత్తం 22 కేసులను పూర్తిగా కొట్టివేసింది. దీంతో ఈ కేసుల నుంచి ఖుష్బూ సుందర్ రిలీఫ్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

ఇదిలా ఉంటే.. అప్పట్లో ఖుష్బూ సుందర్ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఆమె కోసం ఏకంగా ఆలయాన్నే నిర్మించి పూజిస్తున్నారు ఫ్యాన్స్. ఖుష్బూ సుందర్ 2000వ సంవత్సరంలో చిత్ర దర్శకుడు సుందర్ సి ని వివాహం చేసుకున్నారు. సినిమాల్లో కలిసి పనిచేస్తున్నప్పుడు వారిద్దరూ కలుసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే పెద్ద కూతురు అవంతిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేస్తూ బిజీగా ఉంటుంది ఖుష్బూ. అలాగే అటు రాజకీయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

ఖుష్బూ ఫోటోస్..

Khusbhoo New

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us