
కొన్ని సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. మరి కొన్ని సినిమాలు ఎప్పటికీ ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమానే రోజా. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ ఆణిముత్యం ఈ సినిమా. కాశ్మీర్ ఉగ్రవాదుల సమస్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు రెహమాన్ అందించిన సంగీతం ప్రాణంగా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. సాంగ్స్ మాత్రమే కాదు.. చిన్న చిన్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా అరవింద్ స్వామి నటించగా ఆయన సరసన హీరోయిన్ గా మధుబాల నటించారు. 1992లో విడుదలైన ఈ సినిమా తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మధుబాలకు మంచి పేరువచ్చింది. అలాగే ఆమె క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది మధుబాల. ఆమె కెరీర్ లో ఓ మైలు రాయిగా నిల్చింది రోజా.. కాగా ఈ సినిమాలో ముందుగా మధుబాల ప్లేస్ లో మరో హీరోయిన్ ను అనుకున్నారట. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య భాస్కరన్. మణిరత్నం ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య భాస్కరన్ సంప్రదించగా ఆమె నో చెప్పిందట. దాంతో మధు బాలను ఎంపిక చేశారట.
అయితే థియేటర్స్ లో ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో సినిమా చూసిన ఐశ్వర్య భాస్కరన్ ఎంతో బాదపడిందట. మంచి అవకాశాన్ని వదులుకున్నా అని తెగ ఫీల్ అయ్యిందట. థియేటర్ లో సినిమా చూసి వచ్చిన తర్వాత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నా అంటూ తన చెప్పుతో తానే కొట్టుకుంటుదట. గట్టిగా ఏడుస్తూ చాలా ఫీల్ అయ్యిందట ఐశ్వర్య భాస్కరన్. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ రోజా సినిమాలో నటించి ఉంటే ఐశ్వర్య కెరీర్ మారిపోయిఉండేది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.