Tollywood : సినిమాల్లో పవర్ ఫుల్ విలన్.. కోట్ల ఆస్తులు సంపాదించి.. చివరకు కుళ్లిపోయిన స్థితిలో శవమై..

ఇండస్ట్రీలో తోపు యాక్టర్. పవర్ ఫుల్ విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టించిన నటుడు. సినిమాల్లో తన నటనతో పాపులర్ అయిన అతడు.. ఆ తర్వాత తన వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఐదుసార్లు పెళ్లి చేసుకుని 12 ప్రేమ వ్యవహారాలతో అతడు ఎక్కువగా వార్తలలో నిలిచాడు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు.

Tollywood : సినిమాల్లో పవర్ ఫుల్ విలన్.. కోట్ల ఆస్తులు సంపాదించి.. చివరకు కుళ్లిపోయిన స్థితిలో శవమై..
Mahesh Anand

Updated on: Apr 08, 2026 | 8:04 AM

సాధారణంగా సినీరంగంలో హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం పాపులర్ అవుతుంటారు. విలన్ పాత్రలలో తమ నటనతో ఎక్కువగా ఫేమస్ అయిన తారల గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో చాలా మంది నటీనటులు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం ముంబైలోని తన నివాసంలో శవమై కనిపించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? మనం మాట్లాడుకుంటున్న నటుడి పేరు మహేష్ ఆనంద్. ఐదుసార్లు పెళ్లి చేసుకున్నాడు. 12 ప్రేమ వ్యవహారాలు నడిపాడు. కానీ చివరి క్షణంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.

ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

అతడు మొదట రీనా రాయ్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత రెండోసారి బర్ఖా రాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత, ఈ నటుడు మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా మరియా డిసౌజాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. ఈ నటుడు నాల్గవసారి నటి ఉషా బచ్చన్‌ను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మహేష్ ఐదవసారి రష్యన్ మహిళ లానాను వివాహం చేసుకుని ప్రేమకు మరో అవకాశం ఇచ్చాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి, ఈ నటుడు తన కుటుంబం చేతిలో పూర్తిగా మోసపోయాడు.

ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..

కోట్ల ఆస్తులు సంపాదించిన మహేష్ ఆనంద్.. చివరకు తన వారి చేతిలోనే మోసపోయి ఆర్థికంగా చితికిపోయారు. నెమ్మదిగా సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. చివరకు 2019 ఫిబ్రవరి 9న, ముంబైకి చెందిన మహేష్ ఆనంద్ వెర్సోవాలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించారు. అతడి వయసు 57 సంవత్సరాలు మాత్రమే. ఒంటరిగా ఉంటున్న మహేష్ ఆనంద్ రెండు రోజులపాటు తన ఇంటి తలుపు తీయకపోవడంతో పనిమనిషి నటుడి సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. సోఫాలో పడి ఉండగా, అతని పక్కన మద్యం సీసాలు, ఆహార పదార్థాలు పడి ఉన్నాయి. అప్పటికే అతడు మరణించి రెండు రోజులు కావడంతో బాడీ కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. కోట్ల ఆస్తులు సంపాదించి చివరకు ఒంటరిగా దిక్కులేని స్థితిలో మరణించాడు ఈ నటుడు.

ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Mahesh Anand

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us