Vinaro Bhagyamu Vishnu Katha: ఓటీటీలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..

|

Mar 15, 2023 | 8:43 PM

ఫిబ్రవరి 17వ న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది. 

Vinaro Bhagyamu Vishnu Katha: ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..
Vinaro Bhagyamu Vishnu Kath
Follow us on

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమాకు స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరించారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో  వచ్చింది”వినరో భాగ్యము విష్ణు కథ”. ఈ సినిమాలో కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటించింది. ఫిబ్రవరి 17వ న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఉగాది’ పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది ఆహా. మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ అని చెప్పొచ్చు.

వినరో భాగ్యము విష్ణు కథ” సినిమా విషయానికి వస్తే తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అయ్యాడు. ఈ మూవీలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఇదివరకే కిరణ్ కి “ఎస్.ఆర్ కల్యాణమండపం” సినిమాకి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో పాటలను రచించారు.