Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..

ఇటీవల సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. తాజాగా సీరియల్ నటి పెళ్లి కాకుండానే తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

Tollywood : హీరోతో ఎంగేజ్మెంట్.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. ఎందుకంటే..
Keerthy

Updated on: Jan 29, 2026 | 12:36 AM

బుల్లితెరపై మరో జంట బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే సీరియల్ నటి అనుష హెగ్డే తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు మరో టీవీ నటి పెళ్లి కాకుండానే తమ బంధం ముగిసిందంటూ చెప్పుకొచ్చింది. ఆమె పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ షోలో తన లైఫ్ గురించి చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది.. అలాగే తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో మానసిక సంఘర్షణకు గురైంది.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

ఎవరూ లేకుండానే ఒంటరి జీవితం స్టార్ట్ చేసింది. ఓ అనాథ అమ్మాయిని దత్తత తీసుకోగా.. ఆ చిన్నారి సైతం బిగ్ బాస్ కు ముందే చనిపోయింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితంలో వచ్చిన మరో ప్రేమను ప్రేక్షకులకు పరిచయం చేసింది. హీరో విజయ్ కార్తితో బ్రేకప్ జరిగిందంటూ అసలు విషయం బయటపెట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

రెండేళ్ల క్రితం హీరో విజయ్ కార్తీక్ తో కీర్తి భట్ ఎంగేజ్మెంట్ జరిగింది. చాలా రోజులుగా వీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి పలు టీవీ షోలలో సందడి చేశారు. ఇప్పుడు తమ బంధానికి ఎండ్ కార్డ్ వేసింది కీర్తి. ఈ బంధం చాలా రోజుల నుండి కొన‌సాగింది. అది నిజ‌మైనది కూడా. కానీ ఈ బంధం ఎప్పుడూ జీవిత భాగ‌స్వామి లేదా భ‌ర్త‌గా మారిన‌ట్టు అనిపించ‌లేదు. ఇద్దరం స్నేహితులుగా ఉంటామంటూ రాసుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..