Tollywood: ఒక్క రోజుకు బౌన్సర్ల ఖర్చు ఎంతవుతుందో తెల్సా.. ఏకంగా కోట్లలో ఉంటుంది.!

టాలీవుడ్ సినిమాల నిర్మాణంలో పెరుగుతున్న వ్యయాలపై నిర్మాత కట్రగడ్డ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బౌన్సర్ల పారితోషికం సినిమా బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Tollywood: ఒక్క రోజుకు బౌన్సర్ల ఖర్చు ఎంతవుతుందో తెల్సా.. ఏకంగా కోట్లలో ఉంటుంది.!
Katragadda Prasad

Updated on: Mar 04, 2026 | 1:35 PM

నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ బౌన్సర్ల రెమ్యునరేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు వేల రూపాయలు ఖర్చయ్యే బౌన్సర్లతో సినిమా నిర్మాణ వ్యయం కోట్లలో పెరుగుతుందని ఆయన వివరించారు. క్యారవాన్ సంస్కృతి ముందు లేదని, గతంలో నటులు సాధారణంగా షూటింగ్ చేసేవారని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.! టాలీవుడ్ సినిమాల నిర్మాణంలో పెరుగుతున్న వ్యయాలపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బౌన్సర్ల పారితోషికం సినిమా బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన వివరించారు. ఒక బౌన్సర్ రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు సినిమాను, హీరోను బట్టి రెండు వేల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని ప్రసాద్ పేర్కొన్నారు.

కనీసం పది మంది బౌన్సర్లను తీసుకుంటే, రోజుకు ఇరవై వేల రూపాయలు ఖర్చవుతాయని, వంద రోజుల సినిమా షూటింగ్‌కు రెండు కోట్ల రూపాయలు కేవలం బౌన్సర్ల పారితోషికం రూపంలోనే వ్యయం అవుతుందని ఆయన లెక్కలు చెప్పారు. ఈ ఖర్చులన్నీ తెరపై కనిపించనివని చెప్పుకొచ్చారు. గత తరం నటులైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు నుంచి చిరంజీవి, బాలకృష్ణ లాంటి నటులు కూడా ఔట్‌డోర్ షూటింగ్‌లలో చెట్టు కింద కూర్చుని, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని, వేరుశెనగకాయలో, పకోడీలో తింటూ, సీన్ రెడీ అనగానే పాత్రకు తగ్గ డైలాగులు చదివి షూటింగ్‌లో పాల్గొనేవారని కట్రగడ్డ ప్రసాద్ గుర్తు చేశారు. నేడు క్యారవాన్‌లు, ఇతర సౌకర్యాలతో ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Follow Us