Kartik Aaryan: ఆ దెబ్బతో బుద్దొచ్చింది.. ఇక పై ఆ సినిమాలు చేయను.. కార్తీక్ ఆర్యన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చాలా సినిమాలు అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే మన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయి భారీ హిట్స్ అందుకున్నారు కూడా.. అయితే కొన్ని సినిమాలు మాత్రం మనదగ్గర సూపర్ హిట్ గా నిలిచి హిందీలో రీమేక్ అయ్యి బోల్తా కొట్టాయి. అలాంటి సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా నిలిచింది

Kartik Aaryan: ఆ దెబ్బతో బుద్దొచ్చింది.. ఇక పై ఆ సినిమాలు చేయను.. కార్తీక్ ఆర్యన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kartik Aaryan

Updated on: Aug 08, 2023 | 9:25 AM

తెలుగు సినిమాలు ఇతరభాషల్లో డబ్ అయ్యి మంచి ఆదరణ అందుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగులోని సినిమాలు చాలా హిందీలోకి డబ్ అయిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు యూట్యూబ్ లో హిందులోకి డబ్ అవుతూ ఉంటాయి. మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. చాలా సినిమాలు అక్కడ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే మన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయి భారీ హిట్స్ అందుకున్నారు కూడా.. అయితే కొన్ని సినిమాలు మాత్రం మనదగ్గర సూపర్ హిట్ గా నిలిచి హిందీలో రీమేక్ అయ్యి బోల్తా కొట్టాయి. అలాంటి సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా బాలీవుడ్ లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.

అలవైకుఠపురంలో..

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. అలాగే తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. ఈ మూవీలో అన్ని పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకున్న ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.

రీమేక్

ఇక ఈ సినిమా హిందీలో రీమేక్ అయ్యింది. హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాను రీమేక్ చేశాడు. కార్తీక్ హీరోగా కృతిసనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్కడ మాత్రం బోల్తాకొట్టింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అలవైకుఠపురంలో సినిమా హిందీలో డిజాస్టర్ అయ్యింది. అందుకు కారణం ఈ సినిమా హిందీలో రీమేక్ అవవడానికి ముందే హిందీ వర్షన్ యూట్యూబ్ లో ఉంది. అప్పటికే అందరూ హిందీ వర్షన్ ను చేసేశారు. దాంతో రీమేక్ పై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అక్కడి ఆడియన్స్.  తాజాగా ఈ మూవీ నెగిటివ్  టాక్ రావడం పై బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందిచాడు.

కార్తీక్ తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక పై తాను తన కెరియర్లో రీమేక్ సినిమాల జోలికి ఫోనని తేల్చి చెప్పాడు కార్తీక్. రీమేక్స్ చేయడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు అర్ధమైంది అంటూ కామెంట్ చేశాడు. ఆల్రెడీ హిందీలో డబ్బింగ్ అయిన సినిమాను రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు. సినిమా చేసేటప్పుడు నేను అది ఆలోచించలేక పోయాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కళ్లు తెరుచుకున్నాయి. ఇక పై ఎప్పుడూ రీమేక్ సినిమాలు చేయను అని అన్నాడు కార్తీక్ ఆర్యన్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..