ఎంత పెద్ద సినిమాకు అయినా.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వరకే పరిమితమయ్యే జక్కన్న.. మిగతా పనులన్నీ తన కొడుకు కార్తికేయకే అప్పగిస్తుంటారు. తను ఆ పనులన్నీ చేస్తుంటేనే.. జక్కన్న ఫోకస్డ్‌గా డైరెక్షన్ చేస్తుంటారు. అందుకే బాహుబలి.. ట్రిపుల్ఆ ర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించగలిగారు. తన కొడుకు వల్లే.. ఆస్కార్ కలను కూడా నెరవేర్చుకున్నారు. అంతటి ట్యాలెంట్ ఉన్న కార్తికేయ ఫస్ట్ టైం తన తండ్రి గురించి మాట్లాడారు. తన అమ్మ.. కోసం జక్కన్న తరుచుగా ఇంటికి వస్తున్నప్పుడే తనకు తండ్రనే ఫీల్ వచ్చేలా చేశారన్నారు.
రాజమౌళిని కలవక ముందే.. అప్పటికే పెళ్లి చేసుకుని కార్తికేయకు జన్మనిచ్చారు రమ. ఫస్ట్ భర్తతో వివాదాలు ఎక్కువవడంతో.. విడాకులు తీసుకుని.. సింగిల్ పేరెంట్‌గా.. తన కొడుకును చూసుకునే వారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి రమను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కార్తికేయను కొడుకుగా చూసుకుంటున్నారు. ఇక ఇదే విషయమై.. రీసెంట్‌గా ఓ ఇంటర్య్యూలో.. ఇంటర్య్యూయర్ అడిగిన ప్రశ్నపై కాస్త ఎమోసనల్‌గా మాట్లాడారు కార్తికేయ.
అమ్మ, రాజమౌళి పెళ్లి చేసుకోవడానికి ఏడాది ముందు నుంచే ఆయన మా ఇంటికి వచ్చేవారన్నారు. తనను.. అమ్మను డిన్నర్ కు తీసుకెళ్లేవారని.. అలా తనకు అప్పుడే ఒక వైబ్ వచ్చేసిందని.. ఫాదర్ ఫీల్ కలిగిందని అన్నారు. అంతేకాదు.. తనను వదలాలి అనిపించలేదని కాస్త ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. చెప్పుకు రావడమే కాదు.. ఈ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.