నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2(Karthikeya 2. హ్యాపీడేస్ సినిమాతో క్లిక్ అయిన నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. సోలో హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా.. అర్జున్ సురవరం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీటిలో కార్తికేయ 2 ఒకటి. నిఖిల్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. . ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. థ్రిల్లర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తికేయ సినిమాకు మించిన ట్విస్ట్ లు ఈ సినిమాలో ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.కార్తికేయ 2 చిత్రాన్ని 2022 జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.