
సినిమాలు, సీరియల్స్ లో చాలా మంది నటీ నటులు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. హీరోయిన్స్ కంటే సీరియల్ బ్యూటీస్ కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఇక మన దగ్గర సీరియల్స్ కు ఉండే క్రేజ్ ఎంతో అందరికీ తెలుసు. బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లపాటు నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయిన సీరియల్ కార్తీక దీపం. సుమారు 1500లకు పైగా ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికే ఒక సీజన్ పూర్తి చేసుకొని.. రెండో సీజన్ కూడా నడుస్తుంది.. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతోపాటుచాలా మంది పాత్రలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. వాటిలో జ్యోత్స్న పాత్ర ఒకటి. కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా నటించి మెప్పించింది ఈ చిన్నది. ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా.?
కార్తీక దీపం సీరియల్ లో జ్యోత్న్స పాత్రకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ వైరలవుతున్నాయి. ఆమె అసలు పేరు గాయత్రి సింహాద్రి. సీరియల్ లో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది గాయత్రి సింహాద్రి. ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది గాయత్రి. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ చిన్నది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పల్లకిలో పెళ్లి కూతురు, త్రినయని సీరియల్లో నటించి మెప్పించింది గాయత్రి. హీరోయిన్ కావాలన్న ఆశతో సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిందట గాయత్రి. కానీ ఇక్కడ సీరియల్స్ లో కథానాయికగా కాకుండా విలన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. గాయత్రి సింహాద్రి గ్లామరస్ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి