
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 తొలి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌పై కర్ణాటక బుల్డోజర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణిత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే సమయభావం వల్ల కర్ణాటక విజయ లక్ష్యాన్ని 57 పరుగులకే కుదించారు. దీంతో కర్ణాటక బుల్డోజర్స్ 6.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేసి విజయం సాధించింది.
క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)- 2023 షురూ అయ్యింది. ఎప్పుడూ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా ఉండే సినీ తారలు క్రికెట్ మైదానంలోకి అడుగపెట్టారు. బ్యాట్, బాల్ పట్టుకుని మైదానంలో సందడి చేశారు. తాజాగా ఈ మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన సినీ సెలబ్రిటీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. తెలుగు వారియర్స్ తో పాటు చెన్నై రైనోస్, ముంబై హీరోస్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, కేరళా స్ట్రైకర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇక రాయ్ పూర్ వేదికగా జరిగే మొదటి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్ డోజర్స్ తలపడ్డాయి.
నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ కిచ్చా సుదీప్ నేతృత్వంలోని కర్ణాటక బుల్డోజర్స్.. జిషు నేతృత్వంలోని బెంగాల్ టైగర్స్ మధ్య మ్యాచ్‌కి రాయ్‌పూర్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికైంది. తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని ఛేదించిన కర్ణాటక జట్టు మైదానంలోకి దిగి ధీటుగా బ్యాటింగ్ చేసింది. జట్టు కెప్టెన్ కిచ్చా సుదీప్, రాజీవ్ హన్ను ఓపెనర్లుగా బరిలోకి దిగి ఇన్సింగ్స్ ఆరంభించారు. రాజీవ్ హన్ను 11 బంతుల్లో 23 పరుగులు చేయగా, సుదీప్ 11 బంతుల్లో 15 పరుగులతో రాణించారు. దీంతో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది.
అంతకు ముందు బెంగాల్ వారియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్ల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ టైగర్స్ 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో ఉదయ్ సింగ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ జిమ్మీ బెనర్జీ 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 25 పరుగులతో రాణించాడు. ఈ టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టుకు నటుడు వెంకటేశ్ సహ నిర్వాహకుడిగానూ, అఖిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ముంబాయి హీరోస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్, కెప్టెన్‌గా రితేశ్ దేశ్‌ముఖ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక చెన్నై రైనోస్ జట్టుకు కెప్టెన్ జీవా ఐకాన్ ప్లేయర్‌గానూ, విష్టు విశాల్ స్టార్ క్రీడాకారుడిగా ఉన్నారు. ఇక బోజ్‌పురి దబాంగ్ జట్టుకు మనోజ్ తివారి కెప్టెన్‌గా, కేరళా స్ట్రైకర్స్ జట్టుకు నటుడు మోహన్‌లాల్ సహ నిర్వాహకుడిగా, కుంజాకోబోపన్ కెప్టెన్‌గా ఉన్నారు.