
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోన్న సినిమా ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందు ప్రీమియర్స్ షోలతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం .. ఇప్పుడు రోజు రోజుకీ మరిన్ని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. భారతదేశంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ నుంచి యూఎస్ఏలో రికార్డ్స్ సెట్టింగ్స్ నంబర్స్ వరకు సత్తా చాటుతుంది ఈ చిత్రం. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా, అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇక నాలుగు రోజుల్లోనే వందకోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అక్కడ మొదటి వారంతంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ రికార్డ్స్ బ్రేక్ చేసింది హనుమాన్.
ఇప్పటికే ఈ సినిమా వీక్షించిన సినీ ప్రముఖులు చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్.. తేజా సజ్జా యాక్టింగ్ అద్భుతమంటూ కొనియాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి, గోపిచంద్, రవితేజ సహా పలువురు స్టార్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా కన్నడ స్టార్ హీరో.. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి సైతం హనుమాన్ సినిమాను వీక్షించాడు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో హనుమాన్ సినిమాపై ట్వీట్ చేశారు.
My “Jersey” moment🙏
Coincidentally my pose in this is also exactly the same 😀#HanuMan @PrasanthVarma @Primeshowtweets @RKDStudios pic.twitter.com/guXcIRcysI— Teja Sajja (@tejasajja123) January 16, 2024
“హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపించే జాబితాలో చేరడం సంతోషంగా ఉంది. ప్రశాంత్ వర్మ కథ చెప్పిన విధానం ఈ సినిమా విజయానికి కారణం. అలాగే తేజా సజ్జా నటన చాలా కాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.
Joining the chorus of praise for ‘Hanuman’ – a triumph in storytelling and filmmaking by Prashant Verma. Teja Sejja performance stays with you long after the credits roll. #Hanuman@PrasanthVarma @tejasajja123
— Rishab Shetty (@shetty_rishab) January 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.