కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‌లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అనంతరం బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు.. నిన్న మధ్యాహ్నం సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పునీత్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాకయ్యింది. వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.. ఇక నిన్న కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుస్తారు. ఆయనకు కన్నడ సినీపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో ఇలా ఆకస్మాత్తుగా మరణించడంతో పునీత్ వీడియోస్.. ఫోటోస్.. కుటుంబసభ్యుల ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్, అశ్వినీ రేవంత్.. ప్రేమకథ వైరల్ అవుతోంది. పునీత్ ఆకస్మిక మరణం కన్నడ చిత్రపరిశ్రమకు ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. చివరిసారిగా పునీత్‌ను చూసి.. కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక పునీత్ రాజ్ కుమార్.. అశ్విని.. తమ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు. ముందుగా స్నేహంగా మారిన వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఎనిమిది నెలల స్నేహం తర్వాత పునీత్ అశ్వినికి ప్రపోజ్ చేయగానే.. ఆమె వెంటనే అంగీకరించింది. ఇక సినిమాల్లో మాదిరిగానే పునీత్ ప్రేమకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఎంతో ఒపిగ్గా తమ పెద్దవారిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి పునీత్ కుటుంబసభ్యులు ఒప్పుకున్నా.. అశ్విని కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. కానీ ఆరు నెలల తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివరకు 1999న డిసెంబర్ ఒకటిన వీరి వివాహం జరిగింది. వీరికి దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటను చూసి వీధికి కన్నుకుట్టుంది… అర్థాంతరంగా పునీత్ మరణంతో అశ్విని ఒంటరిగా అయిపోయింది. 1981లో అశ్విని. కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించారు. ప్రస్తుతం ఆమె శాండల్‌వుడ్‌లో ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నారు. పునీత్.. అశ్వినీ కలిసి పీఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు.
Puneeth Raj Kumar: పునీత్ మరణవార్త నమ్మలేకపోయా.. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అంటున్న సుమన్