
కొన్నిసార్లు నటీనటులు మాట్లాడే మాటలు వారిని వివాదంలోకి నెట్టేస్తాయి. అలాగే సోషల్ మీడియాలో తారల తీరుపై విమర్శలు వస్తుంటాయి. తమ వ్యక్తిగత జీవితం గురించి తాము తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తాయి. తాజాగా కన్నడ నటి హీతా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భర్త, కుటుంబం గురించి మాట్లాడుతూ.. తనకు పిల్లలు వద్దని.. అసలు కనాలనుకోవడం లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది. పిల్లలను కనడం కంటే కుక్కపిల్లలను పెంచుకోవడం మేలు అంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడూ హీత చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్స్. కన్నడ చిత్రపరిశ్రమలో సిహి కహీ చంద్రకు ప్రత్యేకమై గుర్తింపు ఉంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె హిత చంద్రశేఖర్.. ఇండస్ట్రీకి చెందిన నటుడు కిరణ్ శ్రీనివాస్ ను 2019లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన నాలుగేళ్లు పూర్తైనా పిల్లలు వద్దని చెబుతుంది హితా చంద్రశేకర్.
ఇటీవల ఓ షోలో పాల్గొన్న హిత చంద్రశేఖర్ పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. “మాకు పిల్లలు కావాలని లేదు. నేను, కిరణ్ స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషంయ గురించి చర్చించుకున్నాం. కిరణ్ కూడా నా నిర్ణయానికి అంగీకరించాడు. నాకు నా స్వంత బిడ్డ ఎందుకు కావాలి? నాకు నా బిడ్డ కావాలని అనిపించడం లేదు. నాకు ఈ ప్రపంచం నచ్చడం లేదు. అలాంటప్పుడు మరో బిడ్డను ఈ బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా ? అనే ప్రశ్న కలిగింది. నా భర్త కిరణ్ కూడా నాలాగే ఆలోచించాడు. అందుకే అతడు కూడా నా నిర్ణయానికి ఒప్పుకున్నాడు. మాతృత్వాన్ని ఆస్వాదించాలంటే సొంతంగా బిడ్డ ఉండాల్సిన అవసరం లేదు. కుక్కపిల్లను కూడా సొంత బిడ్డలాగే చూసుకోవచ్చు.
చాలా మంది నన్ను అడుగుతారు. వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకోవడానికి మీ పిల్లలు ఉండాలి కదా అని.. కానీ దాని గురించి నాకు అంతగా బాధ లేదు. ఇక్కడ ఎవరికీ పిల్లలు పుట్టకూడదని నేను చెప్పడం లేదు. కేవలం ఇది నా నిర్ణయం మాత్రమే. ఈ విషయం మా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేశారు ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిత చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.