
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో పెద్ది ట్రైలర్ రికార్డులను కొల్లగొడుతోంది. ఇక సెలబ్రిటీలు కూడా పెద్ది ట్రైలర్ కు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ క్రమంలో కాంతార ఫేమ్, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి పెద్ది ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ షేర్ చేస్తూ… ‘చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ రామ్ చరణ్ అబ్సల్యూట్ ఫైర్ చూపించారు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు. శివ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. పాత్రకు అవసరమైన గాంభీర్యాన్ని చూపించారు. జాన్వీ కపూర్ అందంగా ఉన్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ చాలా బాగుంది. ఎక్స్‌లెంట్ వర్క్’ అని రిషబ్ శెట్టి ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే పెద్ది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాతలు వృద్ధి సినిమాస్ తో పాటు ఈ సినిమాకు పని చేసిన వారందరినీ అభినందించారు కాంతారా హీరో. పెద్ది సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
రిషబ్ శెట్టి ట్వీట్ కు పెద్ది చిత్ర బృందం కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్ గానూ, రన్నర్ గానూ కనిపించనున్నారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ రామ్ చరణ్ గురువు పాత్రలో నటిస్తున్నారు.బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.
The #Peddi trailer looks spectacular.https://t.co/s7bGrILKpf
Mega Power Star @AlwaysRamCharan is looking stunning, absolute fire in every frame. The screen presence of @NimmaShivanna anna adds such a magnificent layer to the film, while #JanhviKapoor adds a beautiful, vibrant… pic.twitter.com/0XlnokyAbg
— Rishab Shetty (@shetty_rishab) May 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.