Kangana Ranaut: చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేసిన కంగనా రనౌత్.. వచ్చేయ్‌ రామా.. వచ్చేయ్‌ అంటూ..

తాజాగా, కంగనా రనౌత్ రాంలాలా విగ్రహం ఫోటోను షేర్ చేసింది. ఆమె ఈ ఫోటోతో పాటు ప్రత్యేక క్యాప్షన్‌ను కూడా షేర్ చేసింది.  పోస్ట్‌లో కంగనా రనౌత్  శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ట్యాగ్ చేసింది. కంగనా రనౌత్ అరుణ్ యోగిరాజ్‌కు ధన్యవాదాలు తెలిపింది. "రాముడు చిన్నపిల్లలా కనిపిస్తాడని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను..

Kangana Ranaut: చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేసిన కంగనా రనౌత్.. వచ్చేయ్‌ రామా.. వచ్చేయ్‌ అంటూ..
Kangana

Updated on: Jan 21, 2024 | 6:39 PM

రేపు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సం చాలా ఘనంగా జరగనుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయ్యి. రామమందిరాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ నటీనటులకు ఆహ్వానం అందింది.అక్షయ్ కుమార్, రజనీకాంత్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, రణదీప్ హుడా, అనుష్క శర్మ, రజనీకాంత్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్, రిషబ్ శెట్టి, యష్, అజయ్ దేవగన్, ప్రభాస్, సన్నీల్ సంయోల్, రామ్ చరణ్, సంజయ్ లీలా బన్సాలీ, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో కంగనా రనౌత్ పేరు కూడా ఉంది.

తాజాగా, కంగనా రనౌత్ రాంలాలా విగ్రహం ఫోటోను షేర్ చేసింది. ఆమె ఈ ఫోటోతో పాటు ప్రత్యేక క్యాప్షన్‌ను కూడా షేర్ చేసింది.  పోస్ట్‌లో కంగనా రనౌత్  శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ట్యాగ్ చేసింది. కంగనా రనౌత్ అరుణ్ యోగిరాజ్‌కు ధన్యవాదాలు తెలిపింది. “రాముడు చిన్నపిల్లలా కనిపిస్తాడని నేను ఎప్పుడూ అనుకుంటుంటాను.. నా ఊహకు తగ్గట్టుగానే ఈ విగ్రహం ఉంది.” అరుణ్ యోగిరాజ్, మీరు నిజంగా ఆశీర్వదించబడ్డారు.

విగ్రహం ఎంత అందంగా, మనోహరంగా ఉందో అంటూ కంగనా రాసుకొచ్చింది.  అరుణ్ యోగిరాజీ శ్రీరాముడే నీకు దర్శనం ఇచ్చాడు. మీరు ధన్యులు అంటూ రాసుకొచ్చింది కంగనా. ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అంతే కాదు తాజాగా అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ చీపురు పట్టుకొని గుడిని శుభ్రం చేసింది కంగనా. అక్కడ ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది కంగనా.

ఆలయాన్ని శుభ్రం చేస్తున్న కంగనా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి