Kangana Ranaut: కియారా అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ పెళ్లి పై కాంట్రవర్సీ క్వీన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వివాదం ఎక్కడుంటే ఈ మధ్య కంగనా అక్కడ ఉంటుంది. ఇప్పటికే పలు విషయాల్లో సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అటు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు ఈ బ్యూటీ.

Kangana Ranaut: కియారా అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ పెళ్లి పై కాంట్రవర్సీ క్వీన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kangana Ranaut

Updated on: Feb 09, 2023 | 7:33 AM

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. వివాదం ఎక్కడుంటే ఈ మధ్య కంగనా అక్కడ ఉంటుంది. ఇప్పటికే పలు విషయాల్లో సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అటు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు ఈ బ్యూటీ. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ పైన కూడా పలు ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన నోటికి పనిచెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కంగనా నిత్యం ఎదో ఒక వార్తతో వైరల్ అవుతోంది. అయితే ఈసారి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ పెళ్లి పై కామెంట్స్ చేసింది.

ఇంతకాలం ప్రేమలో విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా- సిద్ధార్థ్‌ల వివాహం వేడుకకు వేదికైంది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

వీరి వివాహం పై కంగనా కామెంట్స్ చేశారు. కియారా అద్వాని – సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్ విషయం బయటికి రావటంతో ఒక నెటిజన్ ” మీరు డేటింగ్ లో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనా ? ” అంటూ ట్వీట్ చేశాడు. దీనికి బదులిస్తూ..అవును వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. కానీ సినిమా ప్రమోషన్ల కోసం బ్రాండ్ల కోసం కాదు.మిగతావారి కోసం వాళ్ళు లైమ్ టైమ్ లో ఉండేందుకు ఎప్పుడు ప్రయత్నించలేదు. నిజమైన ప్రేమ కలిగిన చాలా చూడముచ్చటైన జంట వీరిద్దరిది” అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.