Kamal Haasan’s Silambaram Skills : ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు కూతురు ఫిదా..!

దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్ విలక్షణ నటుడే కాదు.. అతనిలో ఒక ప్రత్యేక నైపుణ్యం కూడా ఉంది. నటుడిగా ఇప్పటి వరకూ ఏ భాషలోనూ ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేసిన కమల్ హాసన్ సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు...

Kamal Haasans Silambaram Skills : ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు  కూతురు ఫిదా..!
Kamal Haasan

Updated on: Mar 18, 2021 | 6:03 PM

Kamal Haasan’s Silambaram Skills : దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్ విలక్షణ నటుడే కాదు.. అతనిలో ఒక ప్రత్యేక నైపుణ్యం కూడా ఉంది. నటుడిగా ఇప్పటి వరకూ ఏ భాషలోనూ ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేసిన కమల్ హాసన్ సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్నారు. ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో అడుగు పెట్టారు కమల్ హాసన్. ఇటీవల తమిళనాడులో ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన కర్రసాము లో తన పరాక్రమాన్ని ప్రదర్శించారు.

కమల్ హాసన్ కుమార్తె నటి శ్రుతి హాసన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు ఈ వీడియో కి “నేను ఎప్పుడూ నాన్నను ప్రేమిస్తున్నాను. ఈ రోజు మరింతగా నా తండ్రిని పేమిస్తున్నా అంటూ ఓ కాప్షన్ కూడా జత చేసింది ఆ వీడియోకి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ ప్రస్తుతం బిజీబిజిగా ఉన్నారు. కోయంబత్తూరులో ఈ సాంప్రదాయ ప్రదర్శనతో కమల్ హాసన్ అభిమానులను మంత్రముగ్దులను చేశారు. పొడవైన కర్రతో కమల్ చేసిన విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
నటనలో పద్మభూషణ్ అవార్డును అందుకున్న కమల్ తన దృష్టిని సినిమాల నుండి రాజకీయాల వైపు మళ్లించారు. రాజకీయ పార్టీ మక్కల్ నీది మయం (ఎంఎన్ఎమ్ ను స్థాపించి రానున్న ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఏప్రిల్ 6 న జరగనున్న ఎన్నికలకు కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 2 న ప్రకటించబడతాయి.
కమల్ హాసన్ తాజాగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇండియన్ 2 చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.

Also Read: హాట్ హాట్ ఫొటోతో కవ్విస్తున్న సీనియర్ హీరోయిన్.. కొంటె కామెంట్లతో ముంచెత్తుతున్న అభిమానులు.

 ప్రపంచంలోనే అతిభయంకరమైన ప్లేస్ ఈ ద్వీపం.. నో ఎంట్రీ బోర్డు తగిలించేశారు.. అడుగుపెట్టారా అంతే