Vikram: ఊర మాస్ సాంగ్‌తో అదరగొట్టిన కమల్ హాసన్.. ‘విక్రమ్’ ఫస్ట్ సాంగ్

|

May 28, 2022 | 5:26 PM

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'విక్రమ్'.

Vikram: ఊర మాస్ సాంగ్‌తో అదరగొట్టిన కమల్ హాసన్.. విక్రమ్ ఫస్ట్ సాంగ్
Vikram
Follow us on

యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ‘విక్రమ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ ‘మత్తుగా మత్తుగా’ పాట లిరికల్ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఈ పాట ని మాస్, గ్రూవీ సాంగ్ గా డిజైన్ చేశారు. అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్ లో ఫ్యాన్స్ తో విజల్స్ వేయించేలా వుంది. ఈ పాటలో కమల్ హాసన్ డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ముఖ్యంగా తలపై షర్టు కప్పుకొని కమల్ హాసన్ చేసిన మాస్ డ్యాన్స్ ప్రేక్షకులని అలరిస్తుంది. కమల్ హాసన్ ఈ పాటని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో అలరించబోతున్నారు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రధాన తారణంతో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు

Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ

Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్