
తెలుగు , తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రుతిహాసన్. సిద్దార్థ్ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ అమ్మడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా శ్రుతి కెరీర్ ను మార్చేసింది. గబ్బర్ సింగ్ సినిమా సంచలన విజయం సాధించడంతో శ్రుతి పేరు మారు మోగింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకొని టాప్ హీరోయిన్ అయ్యింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే తమిళ్ లోనూ మంచి ఆఫర్స్ అందుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే శ్రుతి నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంటుంది. పలు సినిమాల్లో ఆమె పాటలు కూడా పాడింది. అలాగే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మ్యూజిక్ కు సంబందించిన ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ లోకేష్ కానగరాజ్ తో కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేసింది.
దర్శకుడు లోకేష్ కానగరాజ్ తో కలిసి చేసిన ఈ సాంగ్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా లోకేష్ , శ్రుతి జంట ఆకట్టుకున్నారు. వీరిమధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మ్యూజిక్ వీడియో పై శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. తమ జంట తన తండ్రి కమల్ హాసన్ కు నచ్చింది అని తెలిపింది. 4 నిమిషాల్లో ఒక కపుల్ రిలేషన్‌షిప్‌లోని ఉండే ఎమోషన్స్ అన్ని ఇనిమేల్ సాంగ్ లో ఉన్నాయి అని అన్నారు. రిలేషన్ షిప్ లో ఎత్తుపల్లాలు ఉంటాయని అవి తమ సాంగ్ లో చూపించాం అని అన్నారు శ్రుతి. చిన్న తనం నుంచే తనకు సంగీతం అంటే ఇష్టమని .. అది తన అదృష్టం చెప్పుకొచ్చింది శ్రుతి. కాగా ఇప్పుడు ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉందని.. లోకేష్ తో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇక ఈ సాంగ్ చూసి కపుల్ తన రిలేషన్ షిప్ లోని లోటుపాట్లను సరిదిద్దుకుంటారు అని అనుకుంటున్నా.. తమ జంట తన తండ్రి కమలహాసన్‌కు బాగా నచ్చిందని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.