
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు.
పొలిమేరతో మా జర్నీ స్టార్ట్ అయింది. నిజానికి నాకు యాక్టింగ్ తో పాటు రైటింగ్ కూడా ఇష్టం. పొలిమేర జరుగుతున్నప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానని ఆయనని రిక్వెస్ట్ చేశాను. అలా ఆయన ప్రతి సినిమాలో జర్నీ కొనసాగుతుంది. పొలిమేర సినిమాలో నా పెర్ఫార్మెన్స్ ని అందరూ అభినందించారు. ప్రత్యేకంగా నాకోసం ఒక పేరాగ్రాఫ్ రాశారు. మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఎందుకు పాత్రలు ఇవ్వకూడదనేది అనిల్ గారి ఉద్దేశం. ఇప్పుడు వరకు చేసింది రెండే సినిమాలు. ఆ రెండు సినిమాల్లో కూడా నేను ఉన్నాను.
ఇందులో నరేష్ గారికి జోడిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు ఆరాధన. నా క్యారెక్టర్ ఎక్కడ నుంచి వచ్చింది ఏం చేస్తుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తన పని మీదే శ్రద్ధ పెట్టే క్యారెక్టర్. అలాంటి లైఫ్ లో వచ్చిన ప్రేమ స్టోరీ ఎలా ముందుకెళ్ళింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆరాధన క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. తన క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు. సినిమా చూసిన తర్వాత నా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అల్లరి నరేష్ గారితో నటించడం అనేది నా కెరియర్ కి చాలా మైలేజ్ ఇస్తుంది. నరేష్ గారితో ఇంతకుముందు ఇట్లు మారేడుమిల్లి సినిమా చేశాను. నాకు చిన్నప్పటినుంచి నరేష్ గారు పర్సనల్ గా తెలుసు. నరేష్ గారు చాలా సైలెంట్ పర్సన్. మేము ఎప్పుడు కూడా సినిమాలు గురించి మాట్లాడుతుంటాము. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
శ్రీ విష్ణు గారు సుహాస్ గారు విజయ్ సేతుపతి గారు ఇలా చాలామంది హీరోలు అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఫిమేల్ యాక్ట్రెస్ కి ఆ యాక్సెప్టెన్సీ లేదు. అలా ఎందుకు ఉండకూడదు అని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఒక రిస్క్ తీసుకునే ఇలా పాత్రలు చేస్తున్నాను. ఐదేళ్లు నా కెరియర్ లో విరూపాక్ష పొలిమేర చిత్రాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. నిజానికి లైలా సినిమాలో నా క్యారెక్టర్ చాలా కీలకం, ఆ క్యారెక్టర్ చుట్టే కథ ఉంటుంది. ఆ సినిమా వర్కౌట్ అయి ఉంటే మంచి పేరు వచ్చేది. అయితే నేను ఏదైనా సరే ఒక క్రియేటివ్ యాంగిల్ లోనే చూస్తాను. అలాగే మీరు డాక్టర్ కదా.. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను జనరల్ ఫిజీషియన్ ని. అపోలో లో ప్రాక్టీస్ చేశాను. అయితే కోవిడ్ కి ముందు ఆపేశాను. ఇప్పుడు పూర్తిగా నటనతోనే బిజీగా ఉన్నాను. అయితే నేను పనిచేస్తున్న సినిమా సెట్ లో నన్ను డాక్టర్ గా యూజ్ చేస్తుంటారు (నవ్వుతూ) ఇండియన్ సినిమాలో పారామెడికల్ కల్చర్ తక్కువ. అలాంటి పారామెడికల్ కల్చర్ ని తెలుగు సినిమాలో తీసుకురావాలనే ఆలోచన ఉంది అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.