ప్రస్తుతం టాలీవుడ్ చందమామా కాజల్ (Kajal Aggarwal) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాది చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.బాబు పుట్టిన తర్వాత పూర్తిగా తన సమయాన్ని అతనితో ఎంజాయ్ చేస్తున్న కాజల్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. స్టైలీష్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంది. అయితే దాదాపు సంవత్సరంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్…ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో మళ్లీ బిజీ అయ్యేందుకు ఆమె సుముఖత చూపిస్తుందని.. ఇప్పటికే ఆఫర్స్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ మేనేజర్లకు చెప్పిందని సమాచారం.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో భారతీయుడు 2 చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కాజల్ హీరోయిన్గా నటించాల్సి ఉంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ప్రెగ్నేన్సీ విషయం ఈ సినిమా నుంచి తప్పుకుంది. అంతేకాకుండా నాగర్జున ఘోస్ట్ చిత్రం నుంచి కూడా కాజల్ అవుట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఆమె ఓటీటీ, ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పాలని చూస్తుందని.. మరోసారి అభిమానులను అలరించేందుకు కాజల్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మునుపటి లుక్‌లోకి మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.