Kajal Aggarwal: భర్తను పొగడ్తలతో ముంచేసిన కాజల్.. త్వరలో జీవితాలు మారిపోతాయంటూ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం మాతృత్వ క్షణాలను అనుభవిస్తుంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Kajal Aggarwal: భర్తను పొగడ్తలతో ముంచేసిన కాజల్.. త్వరలో జీవితాలు మారిపోతాయంటూ..
Kajal
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2022 | 12:59 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం మాతృత్వ క్షణాలను అనుభవిస్తుంది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలో తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లూను ఉద్దేశిస్తూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. ప్రతి మహిళా తమ జీవితంలో ఎంతో గొప్పగా భావించే ఈ మధుర క్షణాలలో తన భర్త గౌతమ్ తనకు అన్ని విధాలుగా మద్ధతు ఇస్తున్నట్లు.. తనను ఎల్లప్పుడు సంరక్షిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే తమ జీవితాల్లో మార్పులు రాబోతున్నాయంటూ.. పుట్టబోయే బిడ్డతో ప్రతి క్షణం ఎంతో విలువైన సమయాన్ని గడబోతున్నామని.. ప్రస్తుతం తమ జీవితంలో ఉన్న పరిస్థితలు.. ఆ తర్వాత ఉండవంటూ చెప్పుకొచ్చింది కాజల్..

” డియర్ హస్బెండ్.. ఒక మంచి భర్తగా.. ప్రతి అమ్మాయి కోరుకున తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. చాలా సమయాల్లో నాతో నిస్వార్థంగా ఉన్నావు.. రాత్రివేళల్లో నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాతోపాటే మెలకువతో ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. నాకు అవసరమైన ప్రతి విషయంలో నాకు మద్దతుగా ఉండి అన్ని సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశావు. ప్రతి క్షణం నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నన్ను చూసుకుంటూ.. నేనెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకున్నావు. మా క్యూట్ బేబీ ఈ లోకంలోకి వచ్చే ముందు నువ్వు ఎంత అద్భుతమైన తండ్రివి అయ్యావో చెప్పాలనుకుంటున్నాను.. గత 8 నెలల్లో నువ్వు ఓ గొప్ప తండ్రిగా మారడం చూశాను. పుట్టుబోయే బిడ్డను ఎంతలా ప్రేమిస్తున్నావో.. తనపట్ల ఎంత శ్రద్ద చూపిస్తున్నారో నాకు తెలుసు. మన బిడ్డకు ఇంత అమితమైన ప్రేమను చూపించే తండ్రిగా నువ్వు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే… ప్రతి విషయంలోనూ నువ్వు తనకు ఒక ప్రేరణగా ఉండాలని కోరకుంటున్నాను.. త్వరలోనే మన జీవితాలు మారబోతున్నాయి. ఇప్పుడు మనకు ఉన్నంత ఏకాంత సమయం అప్పుడు ఉండదు. ప్రతి వారం మనం సినిమాలకు వెళ్లలేము.. షికార్లకు వెళ్లలేము.. టీవీ షోలు చూసుకుంటూ ఆలస్యంగా నిద్రపోలేము.. పార్టీలకు.. డేట్ నైట్స్ కు వెళ్లలేము.. కానీ మన హృదయాలను నిత్యం ఆనందంతో నింపే మన పాపతో ఉంటాము.. తనతో మన జీవితం ఆనందంగా ఉంటుంది.. నిద్రలేని రాత్రులు, అనారోగ్యంగా అనిపించే సమయాలు, మనకంటూ సమయం కేటాయించలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇవ్వన్ని మన జీవితాల్లో ఉత్తమమైన క్షణాలు. పరిస్థితులు మారొచ్చు.. కానీ నీపై నా ప్రేమ.. ఇలాగే ఉంటుంది.. నువ్వు నా పక్కన్న ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలిని.. మీరు అద్బుతమైన తండ్రి. ఇకపై మన జీవితంలో జరిగబోయే మార్పులను నేను ప్రేమతో స్వాగతిస్తున్నాను.. నేను ప్రేమిస్తున్నాను ” అంటూ రాసుకోచ్చింది కాజల్.

Also Read: KGF 2 Review: హై ఎక్స్‏పెక్టేషన్స్.. అంతకు మించిన ఎలివేషన్స్.. ఆహా అనిపించిన రాకీ భాయ్‌!

Alia Ranbir Wedding: ఆలియా రణబీర్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఎట్టకేలకు ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..

Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..

Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..