Tollywood: ఏంటీ ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురుగా చేసిన అమ్మాయా..? ఇప్పుడు ఇలా..

|

Mar 22, 2025 | 4:29 PM

తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు కార్తి. ఆయన కీలక పాత్రలో లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఖైదీ’. 2020లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. కథ, బిగి సడలని కథనం, లోకేశ్‌ కనరాజ్‌ టేకింగ్‌, కార్తి నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో హీరో కుమార్తె పాత్రలో నటించిన బాలనటి ఇప్పుడు ఎలా ఉందో తెల్సా..?

Tollywood: ఏంటీ ఖైదీ మూవీలో ఢిల్లీ కూతురుగా చేసిన అమ్మాయా..? ఇప్పుడు ఇలా..
Artist Monika
Follow us on

కలెక్షన్స్ పక్కనబెడితే.. కంటెంట్ ఉన్న సినిమాలు జనాల మనసుల్లో చాలాకాలం ప్రయాణిస్తాయి. అలా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసే సినిమాలు చాలా రేర్‌గా వస్తుంటాయి. కొత్త కథలతో ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించేందుకు యువతరం మేకర్స్ పోటీపడుతున్నారు. అలా క్రేజీ సినిమాలు తీస్తూ.. మంచి అప్లాజ్ తెచ్చుకున్నాడు తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్. తన చిత్రాలకు ఏకంగా ఓ యూనివర్స్‌నే క్రియేట్ చేసిన వ్యక్తి ఇతను. లోకేశ్ తీసిన ఖైదీ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అతగాడి మేకింగ్, టేకింగ్‌కు అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక సినిమా మొత్తం ఢిల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీ కూతురు ఆముదగా మూవీలో నటించిన బేబీ మోనికా అందరికీ గుర్తు ఉంటుంది. నిజానికి సినిమా మొత్తానికి  ప్రధాన ఆయువుపట్టు ఆ అమ్మాయి పాత్రే. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు కంగుతింటారు.

ఒక హత్య కేసులో ఢిల్లీ పాత్రధాని జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. అతని కుమార్తె కేర్ టేకింగ్ హోమ్‌లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ సమయంలో జైలు నుంచి విడుదలై తన కుమార్తెను చూసేందుకు బయలుదేరిన ఢిల్లీకి దారిలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధిగమించిన తర్వాత ఢిల్లీ ఆ అమ్మాయిని కలుసుకుని దూరంగా తీస్కెళ్లిపోతాడు. ఇది ఖైదీ సినిమా కథాశం. ఇంత బ్లాక్ బాస్టర్ మూవీలో.. అద్భుతమైన రోల్ చేసిన బేబీ మోనికా ఇప్పుడు సరికొత్త లుక్‌లోకి వెళ్లిపోయింది.

మోనికా బాలనటిగా చాలా సినిమాల్లో చేసింది. ఆమెకు ఇన్ స్టాలో 30 వేల పై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.  ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి ఉత్తమ బాలనటి అవార్డును సైతం దక్కించుకుంది. ఇంకా కొన్ని రోజులు పోతే తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.