Kaikala Satyanarayana: కైకాల పార్ధివ దేహానికి తారా లోకం నివాళులు.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

దివికేగిన దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్ధివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా

Kaikala Satyanarayana: కైకాల పార్ధివ దేహానికి తారా లోకం నివాళులు.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
Kaikala Satyanarayana

Updated on: Dec 24, 2022 | 6:48 AM

దివికేగిన దిగ్గజ నటుడ్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్ధివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. ఇవాళ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం నాడు కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు నట శిఖరం కైకాల సత్యనారాయణ చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆయన భౌతికకాయానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ నివాళి అర్పించారు.

మహా నటుడి భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. కైకాల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్‌. మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. దివికేగిన దిగ్గజ నటుడికి తెలుగు తారా లోకం నివాళులు అర్పిస్తోంది. గ్రేట్‌ యాక్టర్‌ వెళ్లిపోయినా కేరక్టర్‌ ఎప్పటికీ ఎన్నటికీ మిగిలే ఉంటుంది. తన సినిమాల ద్వారా ఆయన మనల్ని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..