
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదల అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో (ఆగస్ట్ 14న) అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రముఖ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షోలతోపాటు డిస్ట్రిక్ట్ యాప్ లలో ఈ సినిమా టికెట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని విజయాన్ని సాధించింది. బుక్ మై షో డేట్ ప్రకారం 758,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించింది. ఇది అద్భుతమైన ఓపెనింగ్ హామీ ఇవ్వడమే కాకుండా ప్రీ రిలీజ్ బజ్ రికార్డ్స్ సైతం కొల్లగొట్టింది. తారక్, హృతిక్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో వార్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
విడుదలకు నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో 750K మార్కును దాటటం రికార్డ్. బాలీవుడ్‌లోని చాలా పెద్ద సినిమాలు విడుదల వారానికి ముందు 500K ని చేరుకున్నాయి. కానీ వార్ 2 మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో తారక్, హృతిక్ మధ్య సీన్స్ గూస్ బంప్స్ సీన్స్ ఉండనున్నాయని.. ముఖ్యంగా ఎన్టీఆర్ YRF స్పై యూనివర్స్‌లో పవర్ ఫుల్ పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..